: శ్రీమాన్ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ని చూస్తే మాకు అందుకే ఆనందం!: చినజీయర్ స్వామి
‘జీవితంలో మనందరికి ఇచ్చిన అవకాశం చాలా తక్కువ, అందుకే, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మాకు శ్రీమాన్ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ని చూస్తే అందుకే ఆనందం’ అని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తన షష్ట్యాబ్ది ఉత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చినజీయర్ స్వామి మాట్లాడుతూ, ‘ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్లారు. కానీ, అనుకున్నదానికి కట్టుబడి, ధర్మానికి నిలబడి, తాను చేయాలనుకున్న వాటిని చేయగలిగే వ్యక్తిత్వం గల మహనీయులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి మహనీయుడు శ్రీమాన్ కేసీఆర్ గారు. ముఖ్యమంత్రిగా వచ్చారు. రాజ్యపాలన చేస్తున్నారు. అందరి సహకారం ఆయనకు ఉంది.. అది చాలు. ఏమో, దేవుడి పేరు చెబితే ఎవరైనా, ఏమైనా అనుకుంటారేమో, దేవుడి పేరు చెబితే అందరికీ ఇష్టమవుతుందో లేదో... అనే అటువంటి అనుమానాలు లేని, ధైర్యం గల వ్యక్తి కేసీఆర్’ అని చినజీయర్ స్వామి ప్రశంసించారు.