: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు
ఏపీ సీఎం చంద్రబాబు రేపటి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. మాతా అమృతానందమయి కార్యక్రమం ఖరారు కాకపోవడంతో చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కావాల్సి ఉంది. రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా, ఇద్దరు కేంద్రమంత్రులను కూడా చంద్రబాబు కలవాల్సి ఉంది.