: చంద్రబాబుకు తందాన తాన అంటున్న వెంకయ్యనాయుడు: గిడ్డి ఈశ్వరి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తందాన తాన అంటున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. విశాఖపట్టణంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ ప్రారంభానికి ముందు ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుల రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికే వారి సమయం సరిపోతోందని అన్నారు. లోకేష్ కు మంత్రి పదవి కాదు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని వారికి హితవు పలికారు. బాక్సైట్ తవ్వకాలను ఒప్పుకోమని, గిరిజనులు పోరాటం చేస్తారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే గట్స్ ఉన్న మగాడు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ అని ఈశ్వరి తెగేసి చెప్పారు.