: రాష్ట్ర ప్రజలను చంద్రబాబు, వెంకయ్యనాయుడు పక్కదారి పట్టిస్తున్నారు: వైసీపీ నేత సామినేని ఉదయభాను
ఏపీకి ప్రత్యేకహోదా విషయమై రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై వైఎస్సార్సీపీ నేత సామినేని ఉదయభాను మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ను ప్రజలు తిరస్కరించారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు, ఉద్యోగాలు రావాలన్నా, యువత అభివృద్ధి చెందాలన్నా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని అన్నారు. కాగా, విశాఖపట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ జరగనుంది. ఈ సభా వేదికకు గురజాడ అప్పారావు పేరు పెట్టారు.