: టెలికం కంపెనీలపై జీఎస్టీ కత్తి.. వినియోగదారులకు మోతెక్కనున్న మొబైల్ బిల్లు!


మొబైల్ వినియోగదారులకు ఇది చేదువార్తే. ఇక నుంచి మొబైల్ బిల్లు మరింత ప్రియం కానుంది. ఇప్పటికే అధిక టారిఫ్‌లతో జేబులు గుల్ల చేసుకుంటున్న వినియోగదారులు జీఎస్టీ పుణ్యమా అని మరింత చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇటీవల కేంద్రం ప్రకటించిన జీఎస్టీ రేట్లు టెలికం కంపెనీలకు తీవ్ర నిరాశ మిగిల్చాయి. టెలికం సేవలపై అధిక పన్ను రేటును ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైకి నెట్టేసే అవకాశం ఉంది. ప్రస్తుతం టెలికం సేవలపై ఉన్న 15 శాతం పన్ను రేటును 18 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సర్కారు కొత్తగా ప్రకటించిన పన్ను రేట్లలో 5, 12, 18, 28 శాతం శ్లాబులున్నాయి. అటువంటప్పుడు టెలికం సేవలను 12 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తే ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉండడంతో 18 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే మొబైల్ బిల్లులు మూడుశాతం పెరుగుతాయి. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు, రాష్ట్ర అమ్మకం పన్నులు కొనసాగించడం వల్ల కూడా టెలికం రంగంపై పరోక్షంగా ప్రభావం పడే అవకాశం ఉంది. రైల్వేల తర్వాత డీజిల్‌ను ఎక్కువగా ఉపయోగించేది టెలికం రంగమే కాబట్టి టవర్ ఆపరేట్లపై విపరీతమైన భారం పడనుంది.

  • Loading...

More Telugu News