: మధ్యప్రదేశ్‌లో స్కూల్ డైరెక్టర్‌పై తుపాకీతో కాల్పులు జరిపిన తొమ్మిదో తరగతి విద్యార్థి
మధ్యప్రదేశ్ రాట్లాం జిల్లాలోని ఓ స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి తమ స్కూల్ డైరెక్టర్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రగాయాల పాలయిన స్కూల్ డైరెక్టర్ అమిత్ జైన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళితే నిందితుడయిన విద్యార్థి స్కూల్ యూనిఫాంలో కాకుండా మామూలు దుస్తుల్లో స్కూలుకి వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయులు సదరు విద్యార్థిని హెచ్చరించి మళ్లీ ఇంటికి వెళ్లి స్కూల్ యూనిఫాం వేసుకుని పాఠశాలకు రమ్మన్నారు. అనంతరం పాఠశాల సిబ్బంది ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అతడిపై ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా పాఠశాలకు రావడం లేదని, అతడి బిహేవియర్ కూడా బాగోలేదని విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థి యూనిఫామ్ ధరించి తిరిగి పాఠశాలకు వెళ్లాడు. అయితే, తనతో ఓ తుపాకీ కూడా తెచ్చుకొని స్కూల్లో అడుగుపెడుతూనే జైన్ పై కాల్పులు జరిపాడు. విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని అతడి వద్దకు తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై విచారణ జరుపుతున్నారు.