: విశాఖలో ఘోర ప్రమాదం.. పంట కాలువలోకి ఇన్నోవా కారు దూసుకెళ్లి నలుగురి మృతి


ఇన్నోవా కారు ఒక్కసారిగా అదుపుత‌ప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన ప్ర‌మాద ఘ‌ట‌న విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం మండలం గోకులపాడు అడ్డరోడ్డులో ఈ రోజు సాయంత్రం చోటు చేసుకుంది. అక్క‌డి జాతీయరహదారిపై కారు వెళుతోన్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్రమాదంలో కారులో ప్ర‌యాణిస్తోన్న ఓ మ‌హిళ స‌హా నలుగురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. వెంట‌నే స్పందించిన పోలీసులు, అధికారులు ఘటనాస్థలి వ‌ద్ద స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. కారును ఓ క్రేన్ సాయంతో బ‌య‌ట‌కు తీశారు. ప్ర‌మాదంలో మృతిచెందిన వారిని గాజువాక వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ మార్గంలో ట్రాఫిక్ జాం ఏర్ప‌డింది.

  • Loading...

More Telugu News