: గుజరాత్ లో రోడ్డు ప్రమాదం .. భక్తుల మినీ బస్సును ఢీకొన్న ట్రక్.. 14 మంది మృతి
గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా వాల్దేర పాతియా గ్రామంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌కోట్ జిల్లా సోక్డాకు చెందిన 17 మంది యాత్రికులు యాత్రా స్థలమైన పంచమహల్‌లోని పావగఢ్ నుంచి తిరిగి తమ ప్రదేశానికి వెళుతుండగా వారు ప్రయాణిస్తోన్న మినీ బస్సును ఓ ట్రక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది యాత్రికులు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.