: చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
వైసీపీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా నిలిపి వేశారని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను కేసులలో ఇరికించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఈ సమస్యలపై చర్చించేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ రోజు లేఖ ఇచ్చారు పిన్నెల్లి.