: విద్యుదాఘాతం కారణంగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ రైల్ నిలయంలోని రిక్రూట్ మెంట్ ఆఫీస్‌లో విద్యుదాఘాతం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించి చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక శకటాలతో అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా జరిగిన నష్టంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.