: ఐదు బంగారు పతకాలతో అలరించిన అసోం కుర్రాడు
పదిహేనేళ్ల బస్తబ్ తపన్ బొర్డోలోయ్ శ్రీలంకలో జరిగిన దక్షిణాసియా ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటాడు. అసోంకి చెందిన బస్తమ్ ఏకంగా ఐదు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించి 'ఔరా' అనిపించాడు. 2012లో అసోం రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొన్న బస్తబ్ తొలిసారి సిల్వర్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత మెరుగైన సాధనతో శ్రీలంకలో అదరగొట్టాడు. అంతేకాదు, ఉత్తర భారతదేశం నుంచి శ్రీలంక ఛాంపియన్ షిప్ కు వెళ్లిన ఏకైక స్విమ్మర్ బస్తబే. 50 మీటర్ల బటర్ ఫ్లై, 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 4x100 మీటర్ల మిక్స్ డ్ రిలే, 4x100 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే, 4x200 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే విభాగాల్లో స్వర్ణం సాధించాడు. 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్ లో సిల్వర్ సొంతం చేసుకున్నాడు.