: చంద్రబాబు 'కోతలకు అన్న.. చేతలకు సున్న': భూమన కరుణాకర్ రెడ్డి
చంద్రబాబు 'కోతలకు అన్న..చేతలకు సున్న’ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘చెప్పేది అభివృద్ధి మంత్రం.. చేసేది అవినీతి తంత్రం. పచ్చిఅబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి గారూ.. రుణమాఫీ చేస్తే రైతుల అప్పులు తగ్గిపోతాయా? పెరిగిపోతాయా? నరకాసురుడు, బకాసురుడిలాగానే చంద్రబాబుగారిని అబద్ధాసురుడు అని అనాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు’ అని భూమన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.