: క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతికి ఎవరూ కారణం కాదు.. తీర్పును వెల్లడించిన కోర్టు


ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతిని ఎవరూ మర్చిపోలేరు. 2014లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఓ దేశవాళీ మ్యాచ్ లో బౌలర్ అబాట్ విసిరిన ఓ బౌన్సర్ హ్యూస్ తలను బలంగా తాకింది. ఆ దెబ్బకు విలవిల్లాడిన హ్యూస్ పిచ్ పైనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల తర్వాత అతను తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం న్యూసౌత్ వేల్స్ కోర్టు తీర్పును వెలువరించింది. హ్యూస్ మృతికి ఎవరూ కారణం కాదని తన తీర్పులో స్పష్టం చేసింది. బంతిని అంచనా వేయడంలో హ్యూస్ విఫలమయ్యాడని కోర్టు తెలిపింది. అతని పొరపాటు వల్లే బంతి అతడిని బలంగా తాకిందని చెప్పింది. ఇదే సమయంలో కోర్టు ఓ సూచన చేసింది. ఆమోదయోగ్యం కాని బౌలింగ్ ను క్రికెట్ ఆస్ట్రేలియా సమీక్షించాలని... దానికి తగిన చట్టాలను రూపొందించాలని జడ్జి సూచించారు.

  • Loading...

More Telugu News