: మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు: తిరుమల ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు
శ్రీవేంకటేశ్వరస్వామి వారి నామాలను తాను మార్చలేదని తిరుమల ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్పష్టం చేశారు. 45 ఏళ్లుగా శ్రీవారికి సేవ చేస్తున్నానని... ఇలాంటి పనులు తాను చేయనని ఆయన చెప్పారు. తన కుటుంబాన్ని కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని... తమపై లేనిపోని నిందలు మోపుతున్నారని ఆరోపించారు. నిబంధనల మేరకే తన మనవడిని గర్భాలయంలోకి తీసుకెళ్లానని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంలో నైవేద్య విరమణ సమయంలో తన మనవడిని గర్భాలయంలోకి తీసుకెళ్లారన్న ఆరోపణల నేపథ్యంలో రమణ దీక్షితులకు టీటీడీ ఈవో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, శ్రీవారి నామాలను మార్చారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.