: ప్రధాని మోదీపై ధ్వజమెత్తిన లాలూప్రసాద్ యాదవ్
ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎమర్జెన్సీ నాటి రోజులను తలపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 'మోదీ ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని రూపొందిస్తున్నారు?' అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మనోభావాలను ఎలా విస్మరిస్తారని అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని కేంద్రం టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.