: గవర్నర్ నరసింహన్‌కు కేక్ తినిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనతో కేక్ కట్ చేయించి, తినిపించారు. ఈ రోజు నరసింహన్ 70వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నరసింహన్ కోసం ప్రత్యేకంగా ఈ కేక్‌ను రాజ్‌భవన్‌కు తీసుకెళ్లారు. అనంతరం నరసింహన్‌తో భేటీ అయిన చంద్రబాబు అరగంట సేపు చర్చలు జరిపారు. ముఖ్యంగా తెలంగాణకు సచివాలయ భవనాల అప్పగింతపై చర్చించారు. మరోవైపు నరసింహన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.