: అఫ్గాన్‌లో వైమానిక దాడులు... మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు మృతి


ఆఫ్గానిస్థాన్ లో ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గ‌నైజేష‌న్(నాటో) ద‌ళాలు వైమానిక‌ దాడులు జ‌రుపుతున్నాయి. సెప్టెంబ‌రులో అఫ్గాన్ లోని కుందుజ్ ప్రాంతాన్ని తాలిబాన్‌ ఉగ్రవాదులు స్వాధీన‌ప‌రుచుకున్నారు. గ‌తంలోనూ ఓ సారి తాలిబ‌న్లు ఈ ప్రాంతాన్ని ఆక్ర‌మించుకుని విడిచిపెట్టారు. తాజాగా అఫ్గాన్‌–అమెరికా దళాలు ఈ ఉగ్ర‌వాదుల‌పై దాడులు జ‌రుపుతుండ‌గా ఇద్ద‌రు అమెరికా సైనికులు మృతి చెందారు. దీంతో నాటో దళాలు నిన్న‌ వైమానిక దాడులు జ‌ర‌ప‌డంతో అక్క‌డి ప్రాంతంలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 25 మందికి గాయాల‌య్యాయి.

  • Loading...

More Telugu News