: ఈ నెల నుంచే దేశమంతా ‘ఆహార భద్రత’.. బియ్యం కేజీ రూ.3, గోధుమలు కేజీ రూ.2
భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆహార భద్రత చట్టం ఈ నెల నుంచే దేశ ప్రజలకి అందుబాటులోకి రానుందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా దేశంలోని 80 కోట్ల మందికి బియ్యం, గోధుమలను అందించనున్నారు. కేరళ, తమిళనాడు మినహా దేశమంతటా ప్రతి పౌరుడికీ బియ్యం కేజీ రూ. 3, గోధుమలు కేజీ రూ.2 లకు 5 కేజీల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం కేంద్రం రూ.1.4 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. యూపీఏ సర్కారు కలల పథకంగా భావించిన ఈ చట్టం 2013లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే.