: ఇన్ ఫెక్షన్ అదుపులోకి... క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి బయటకు జయలలిత: అన్నా డీఎంకే సీనియర్ నేత పొన్నియన్
చెన్నై అపోలో ఆసుపత్రిలో ఐదు వారాలుగా చికిత్స పొందుతున్న సీఎం జయలలితను త్వరలోనే సీసీయూ (క్రిటికల్ కేర్ యూనిట్) నుంచి బయటకు తెచ్చి రూములో ఉంచనున్నారని అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నియన్ వ్యాఖ్యానించారు. ఆమె ఊపిరితిత్తుల్లోని ఇన్ ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, శ్వాసను కూడా స్వయంగా పీల్చుకుంటూ ఉండటంతో ఆమెను గదిలోకి మారుస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడామె అందరితోనూ మాట్లాడుతున్నారని, వారం రోజులుగా ఘన ఆహారాన్ని తీసుకుంటున్నారని వివరించారు. ఆమెను ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలన్నది వైద్యుల నిర్ణయంపై ఆధారపడి వుంటుందని, ఆమె ఆరోగ్యం మెరుగు పడినందున మిగిలిన చిన్న సమస్యలను ఇంట్లో ఉంచి కూడా నయం చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడం వెనుక డాక్టర్ల కృషి ఎంతో ఉందని తెలిపారు.