: హైదరాబాద్ లో భారత్, చైనా భద్రతాధికారుల సీక్రెట్ సమావేశం


భారత్, చైనా దేశాలకు చెందిన భద్రతాధికారులు సమావేశమయ్యారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశం చాలా రహస్యంగా జరుగుతోంది. ఈ సమావేశానికి భారత్ తరపున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, చైనా భద్రతా సలహాదారు యాన్ జీన్ జోతో పాటు అత్యున్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. ఇరు దేశాలకు చెందిన దౌత్యపరమైన అంశాలపై వీరు చర్చిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాకుండా వేరే ప్రదేశంలో ఈ సమావేశం జరగడం ఇదే తొలిసారి. భారత్-చైనా సరిహద్దులో అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, పాకిస్థాన్ బోర్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొనడం తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News