: కరుడు గట్టిన ఉగ్రవాది ఒమర్ కలిక్ అరెస్ట్... భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం


కరుడుగట్టిన ఉగ్రవాది ఒమర్ కలిక్ పోలీసులకు చిక్కాడు. లష్కరే తోయిబాకు చెందిన ఒమర్ లిక్, ఇండియాలో భారీ ఎత్తున విధ్వంసం జరపడమే లక్ష్యంగా సరిహద్దులు దాటి జమ్మూకాశ్మీర్ లోకి ప్రవేశించగా, విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు సోపోర్ ప్రాంతంలో ఖలిక్ ను అరెస్ట్ చేశాయి. ఖలిక్ నుంచి అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్టు సమాచారం. ఒమర్ ఖలిక్ అరెస్టుపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News