: తన వాటాకు 'టాటా' చెప్పబోనంటున్న మిస్త్రీ!
తమ కుటుంబానికి టాటా సన్స్ లో ఉన్న 18.5 శాతం వాటాను విక్రయించేందుకు సైరస్ మిస్త్రీ ఏ మాత్రం సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. టాటా సన్స్ చైర్మన్ గా మిస్త్రీని తొలగించిన తరువాత, పల్లోంజీ కుటుంబానికి ఒక్క పైసా వాటా కూడా సంస్థలో ఉండరాదని రతన్ టాటా భావిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మిస్త్రీ వాటాలను కొనే వ్యూహాత్మక భాగస్వామిని గుర్తించే పనిలో ఆయనుండగా, తన వాటాలను ఆమ్మేసుకునే ఆలోచనను మిస్త్రీ ఎంతమాత్రమూ చేయడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని మిస్త్రీకి దగ్గరగా ఉండే వర్గాలు తెలిపాయి. టాటా గ్రూప్ తో సైరస్ మిస్త్రీ దీర్ఘకాల యుద్ధానికి దిగేందుకే సిద్ధమయ్యారని వారు అన్నారు.