: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపర ఝాన్సీ.. అభివర్ణించిన సినీనటి శారద
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను అపర ఝాన్సీగా అభివర్ణించారు ప్రముఖ సినీనటి శారద. గత కొన్ని రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు గురువారం ఆమె ఆస్పత్రికి వచ్చారు. వైద్యులను అడిగి జయ ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ జయలలిత అపర ఝాన్సీ అని, అనారోగ్యాన్ని జయించి ఆస్పత్రి నుంచి త్వరలోనే ఆమె బయటపడతారని పేర్కొన్నారు. జయలలితకు ఝాన్సీరాణి అంతటి ధైర్య సాహసాలు ఉన్నాయని కొనియాడారు.