: యువరాజ్ సహా నా ముగ్గురు పిల్లలు సింహాలు.. వారు గడ్డి తినరు!: మాజీ కోడలుపై యువీ తండ్రి మండిపాటు


‘యువరాజ్ సహా నా ముగ్గురు పిల్లలు సింహాలు..వారు గడ్డి తినరు’ అని యువీ తండ్రి యోగ్ రాజ్ సింగ్ అన్నారు. యువరాజు సింగ్ సోదరుడు జొరావర్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ తన కుటుంబంపై చేసిన ఆరోపణల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జొరావర్ నుంచి వేరుపడ్డ ఆకాంక్ష శర్మ ఇటీవల బిగ్ బాస్ టీవీ షోలో పాల్గొంది. ఈ టీవీ షోలో యువరాజ్ సింగ్, తల్లి షబ్నం సింగ్ పై పలు ఆరోపణలు చేసింది. యువరాజ్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటాడని ఆరోపించింది. ఈ ఆరోపణలను యువీ తండ్రి యోగ్ రాజ్ సింగ్ తాజాగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. యువీని విమర్శించే ముందు, ఆకాంక్ష శర్మ తన ఇంటిని చక్క దిద్దుకోవాలని హితవు పలికారు. ఈ తరహా ఆరోపణలు యువీని ఏమీ చేయలేవని చెబుతూ, టీమిండియాలోకి యువరాజు మళ్లీ వస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News