: అఖిల్ పెళ్లి ఇటలీలో.. అతిథులు వందల్లో?


అఖిల్ అక్కినేని, ఫ్యాషన్ డిజైనర్ శ్రియాభూపాల్ ల నిశ్చితార్థం డిసెంబరు 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు, జీవీకే హౌస్ లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే, అఖిల్, శ్రియాల వివాహం ఎక్కడ జరుగుతుందనే విషయమై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. వీరి వివాహం ఇటలీలో జరిపితే బాగుంటుందని కుటుంబసభ్యులు అనుకున్నట్లు సమాచారం. ఇక, పెళ్లి అతిథుల విషయాని కొస్తే, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 600 మందిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, వచ్చే నెల 9న జరగనున్న వీరి నిశ్చితార్థానికి సంబంధించి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వారిని ఆహ్వానించే పనిలో అక్కినేని నాగార్జున ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News