: ఎమ్మెల్యేలు.. మేం చెప్పినట్లు నడచుకుంటేనే..
కర్ణాటకలోని మంగళూరు పట్టణ యువతలు, వివాహిత మహిళలు ఇప్పుడు బలమైన పల్లవి వినిపిస్తున్నారు. తమ ప్రాంతంలో కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు తామే కొన్ని బాధ్యతలు అప్పగిస్తామంటున్నారు. హిందుత్వ సంస్కృతి ముసుగులో ఆంక్షలు, బహిరంగ ప్రదేశాలలో యువకుల వేధింపులను ఇంకెంత మాత్రం సహించేది లేదని చెబుతున్నారు. మహిళా ఉద్యమనేత విద్యా దినకర్ మాట్లాడుతూ.. ''గూండాయిజాన్ని అరికట్టి మహిళలకు రక్షణనివ్వాల్సిన బాధ్యతే మీదేనని ఎమ్మెల్యేలకు చెబుతాం. వారి పనితీరును మదింపు వేస్తాం. మహిళలకు రక్షణనివ్వడంలో విఫలమైతే వారిని మేమే తొలగిస్తాం'' అని చెప్పారు. తొలగించడమంటే వారిని ప్రజాప్రతినిధిగా పరిగణించకపోవడమే. నారి తలచుకుంటే ఆకతాయిల ఆటలు ఎల్లకాలం సాగవు.