: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఏర్పడిన అనిశ్చితి కారణంగా ఈ రోజు కూడా మన స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 27430 పాయింట్ల వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు నష్టపోయి 8485 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈలో భారతీ ఇన్ ఫ్రాటెల్, హీరో మోటో కార్ప్, హిందాల్కో, ఐటీసీ సంస్థల షేర్లు లాభపడగా, బీపీసీఎల్, అరబిందో ఫార్మా, అదానీ పోర్ట్స్, ఓఎన్ జీసీ, గ్రాసిమ్ సంస్థల షేర్లు నష్టపోయాయి.