: ఈ శ్మశానంలో 50 లక్షల సమాధులు ఉన్నాయి!


నమ్మలేకపోతున్నారు కదూ? కానీ ఇది నిజం. అక్కడ కనుచూపుమేర సమాధులు మాత్రమే కనిపిస్తాయి. 50 లక్షల సమాధులను మనం అక్కడ చూడవచ్చు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఈ శ్మశానం ఉంది. దీన్ని వాదీ-ఉల్-స్సలామ్ అని పిలుస్తారు. అంటే శాంతి లోయ అని అర్థం. 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ శ్మశానంలో ప్రతి ఏటా ఐదు లక్షల సమాధులు నిర్మిస్తారట. కొత్త సమాధులు కట్టేకొద్దీ, పాత సమాధులు ధ్వంసం అవుతుంటాయి. అయినప్పటికీ 50 లక్షల సమాధులు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ప్రపంచంలో ఇంత పెద్ద శ్మశానం మరెక్కడా లేదు.

  • Loading...

More Telugu News