: నాలుగు అడుగులు పెరిగిన పిల్లి.. గిన్నిస్ రికార్డు సొంతం
సాధారణంగా ఉండాల్సిన పొడవుకంటే రెట్టింపు పొడవు పెరిగిన ఓ పిల్లి తాజాగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. పిల్లులు సాధారణంగా గరిష్టంగా రెండు అడుగుల ఎత్తు పెరుగుతాయి. కానీ, యూకేలోని వేక్‌ఫీల్డ్‌కి చెందిన కెల్సీ గిల్ అనే మహిళ ఇంట్లో పెరుగుతున్న ‘లూడో’ అనే పిల్లి మాత్రం నాలుగు అడుగులు పెరిగింది. దీంతో అత్యంత పొడవైన పిల్లి ఇదేనంటూ గిన్నిస్ బుక్ ప్రతినిధులు తేల్చిచెప్పారు. ‘లూడో’ ప్రపంచంలోనే అతిపెద్ద బతికున్న పిల్లి అని పేర్కొన్నారు. ఈ రికార్డు ఇప్పటివరకు ‘మేరిన్ కూన్’ అనే మూడు అడుగుల పదకొండు అంగుళాల పొడవు ఉన్న పిల్లిపై ఉండేది. ఆ పిల్లి జాతికి చెందిన లూడోనే మళ్లీ రికార్డును సొంతం చేసుకుంది. గతంలో ‘మేరిన్ కూన్’ పిల్లి హ్యారీపోటర్ సినిమాల్లోనూ నటించింది. తమ పిల్లి లూడోని సినిమాల్లో చూపించే ప్రయత్నం చేస్తామని కెల్సీ గిల్ చెప్పింది. తాము పెంచుకునే పిల్లికి గిన్నిస్ రికార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. లూడో చాలా బద్ధకంగా ఉంటుందని, దానికి ఏది పెడితే అది తిని హాయిగా నిద్రపోవడమే అలవాటని ఆమె చెప్పింది.