: ఆయనకు నాతో కలిసి పనిచేయాలని ఉందని అనుకోను: హీరోయిన్ సోనమ్ కపూర్
బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ తనదైన శైలిలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో నటించాలనే కోరిక ఉందని తెలిపింది. అయితే, తనతో నటించాలనే ఉద్దేశం ఆయనకు ఉందని తాను భావించడం లేదని చెప్పింది. "షారుఖ్ తో కలసి నటించేందుకు నాకు చాలా అవకాశాలు వచ్చాయి. నాకు కూడా ఆయనతో కలసి పని చేయాలనే కోరిక ఉంది. అయితే, నాతో కలిసి పనిచేయాలని ఆయన ఎప్పుడు అనుకుంటారో... అప్పుడే అది సాధ్యమవుతుంది. పలానా హీరోయిన్ తో కలిసి నటించాలా? వద్దా? అనేది హీరోనే నిర్ణయిస్తాడని... సినీ రంగంలో ప్రస్తుతం అదే జరుగుతోంది" అని తెలిపింది.