: అఖిలేష్ యాత్ర నేటి నుంచి... ములాయం రాకపై కొనసాగుతున్న సస్పెన్స్
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 'వికాస్ రథ యాత్ర' మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రతిష్ఠాత్మక ఈ యాత్రకు అధికార సమాజ్ వాదీ పార్టీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ హాజరవుతారా? అన్న సంగతిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ములాయం సోదరుడు, పార్టీ రాష్ట్ర చీఫ్ శివపాల్ యాదవ్ పాల్గొనే అంశంపైనా స్పష్టత రాలేదు. ఇప్పటికే రథయాత్రకు ఎంతో ప్రచారాన్ని కల్పించగా, భారీ ఎత్తున యువకులు యాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది. యాత్ర సాగే మార్గంలో అఖిలేష్ సాధ్యమైనన్ని ఎక్కవ చోట్ల మాట్లాడుతారని, యువతతో పాటు రైతులు, మైనారిటీలతో ఆయన మమేకమవుతారని తెలుస్తోంది.