: రెస్ట్ రూముల్లో రహస్య కెమెరాలు పెట్టిన ఫార్మా కాలేజ్ అకౌంటెంట్... విద్యార్థినుల ఆందోళన... సారీతో సరిపుచ్చుకోమని నచ్చచెబుతున్న యాజమాన్యం
రాజమహేంద్రవరంలోని కేజేఆర్ ఫార్మా కాలేజీలో అకౌంటెంట్ గా పనిచేస్తూ, విద్యార్థినుల హాస్టల్ కు ఇన్ చార్జ్ గా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. రెస్టురూముల్లో సీసీ కెమెరాలను అమర్చి ఆ దృశ్యాలను చూపి బ్లాక్ మెయిల్ కు దిగాడు. విద్యార్థినులకు ఏ అవసరం వచ్చినా, తన దగ్గరకే రావాల్సి వుండటంతో, ఆ అవసరాన్ని అలుసుగా తీసుకుని ద్వందార్థాలతో మాట్లాడటం, అసభ్యకరమైన వీడియోలు పంపండం వంటివి చేస్తున్నాడని ఆరోపిస్తూ, అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు నిరసనలకు దిగారు. కాలేజీ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా, ఫలితం లేకపోయిందని ఆరోపించారు. కాగా, ఈ ఘటనలపై యాజమాన్యం స్పందిస్తూ, శ్రీనివాస్ ను విధుల నుంచి తొలగించేందుకు అంగీకరింలేదని తెలుస్తోంది. ఆయనతో క్షమాపణలు మాత్రం చెప్పిస్తామని వెల్లడించగా, విద్యార్థినులు అందుకు అంగీకరించలేదు. వీరి నిరసనలతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. న్యాయం చేస్తామని వారి నుంచి వచ్చిన హామీ మేరకు ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలిపారు.