: ‘గాలి’ ప్రేమకు నేను బానిసను అన్న సంపూ.. రాత్రికి రాత్రే అలా ఎందుకు చేశాడు?
గనుల అక్రమ తవ్వకాల కేసులో నిందితుడైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె పెళ్లి కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి కార్డుల నుంచి అన్నీ భారీగా ఉండేలా ప్లాన్ చేసిన గాలి దేశం దృష్టిని మరోమారు తనపై తిప్పుకున్నారు. తన కుమార్తె పెళ్లికి ప్రముఖులను ఆహ్వానించేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆయన కొందరు సినీ ప్రముఖులను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు కూడా ఆహ్వాన పత్రిక అందింది. ఈ విషయాన్ని సంపూ తన ఫేస్‌బుక్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె పెళ్లి శుభలేఖ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆ కుటుంబం తనపై చూపించే ప్రేమాభిమానాలకు తానెప్పుడూ బానిసనంటూ సోమవారం బరువైన పోస్టు చేశాడు. అయితే అంతలోనే ఏమైందో తెలియదు కానీ, ఆ తర్వాత ఈ పోస్టు కనిపించలేదు. రాత్రికిరాత్రే ఆ పోస్టును సంపూ డిలీట్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సంపూ దానిని ఎందుకు తొలగించి ఉంటాడన్న దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.