: విజయవాడ సుందరయ్యనగర్‌లో భారీ పేలుడు.. ఉలిక్కిపడిన స్థానికులు
విజయవాడ సుందరయ్యనగర్‌లో కొద్దిసేపటి క్రితం భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందో తెలియక భయంతో వణికిపోయారు. అయితే పేలింది సిలిండర్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. పద్మారావు అనే వ్యక్తి ఉదయం ఇంట్లోని కంప్యూటర్ ఆన్ చేయగానే పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. పేలుడు దాటికి ఇంట్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. పార్కింగ్‌లో ఉన్న కారుతోపాటు పక్కనున్న నాలుగు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రాత్రంతా గ్యాస్ లీక్ కావడమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన పద్మారావు, పనిమనిషి జ్యోత్సను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.