: అందరికీ సొంతిళ్లు కార్యక్రమంలో భాగంగా ఒప్పందం కుదిరింది: వెంకయ్యనాయుడు


దేశంలో అందరికీ సొంతిళ్లు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కేంద్ర పట్టణ పేదరిక నిర్మూలన శాఖ, ఐటీశాఖ మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంక‌య్య‌నాయుడు పేర్కొన్నారు. 2022 కల్లా అందరికీ సొంతిళ్లు క‌ల్పించే దిశ‌గా తాము కృషి చేస్తున్న‌ట్లు, ఈ ప‌థ‌కంలో భాగంగా ప్ర‌జ‌లు అంత‌ర్జాలంలో ఇంటికోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇల్లు కోసం చేసుకున్న‌ దరఖాస్తులో ఏవైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకునేలా అవగాహన ఒప్పందం కుదిరింద‌ని వెంక‌య్య చెప్పారు. కేంద్రం అందిస్తోన్న ప‌థ‌కాలు దారిమ‌ళ్ల‌కుండా స‌మ‌ర్థ‌వంతంగా పేద‌ల‌కు అందేలా చూడాల‌ని ఆయ‌న‌ అధికారులను కోరారు.

  • Loading...

More Telugu News