: జైళ్లలో చికెన్ బిర్యానీ తినడం..తప్పించుకోవడం..మళ్లీ దాడులు చేయడం!: ఉగ్రవాదులపై సీఎం శివ్ రాజ్ సింగ్
భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులను పోలీసులు హతమార్చిన ఘటనపై పలు విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ దొరికిపోయిన వారు ఏళ్ల తరబడి జైళ్లలో ఉంటూ చికెన్ బిర్యానీ తింటుండటమే కాక, తప్పించుకుని పారిపోయి, మళ్లీ ఉగ్ర కార్యకలాపాలకే పాల్పడుతున్నారని అన్నారు. ఈ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమన్నారు.