: కర్నూలులో రోడ్డెక్కి ఆందోళనకు దిగిన విద్యార్థినులు
కర్నూలు జిల్లాలోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు ఈ రోజు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. కళాశాల స్థలాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడాలని నినాదాలు చేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కళాశాల గోడను కూల్చివేశారని, దీంతో కొందరు వ్యక్తులు తాగి లోపలికి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మొదట 40 మీటర్ల స్థలాన్ని తీసుకుంటామన్న అధికారులు ఇప్పుడు 60 మీటర్లకు పైగా తీసుకుంటున్నారని వారు చెప్పారు. దీంతో వారికి మైదానం కూడా లేకుండా పోతోందని అంటున్నారు. కళాశాల భూమిని కబ్జా చేసి అక్కడ షాపులు కట్టుకోవాలని కొందరు చూస్తున్నారని విద్యార్థులు మీడియాకు తెలిపారు.