: నయీమ్ కేసులో ఆర్.కృష్ణయ్యకు పోలీసుల నోటీసులు.. నార్సింగ్ పోలీసుల ముందు విచారణకు హాజరైన ఎమ్మెల్యే
ఇటీవల తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎల్బీనగర్ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆర్.కృష్ణయ్యకు విచారణ నిమిత్తం పోలీసులు నోటీసులు పంపారు. దీంతో ఆయన ఈ రోజు నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనను పోలీసులు దాదాపు గంటసేపు విచారించారు. నయీమ్‌తో కృష్ణయ్యకు ఉన్న సంబంధాలు, పలు వివరాలపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.