: ప్రేమజంట పెళ్లికి ఆ జంతువే చీఫ్ గెస్ట్!


వివాహ‌ వేడుక అనేది పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి జీవితాంతం గుర్తుండిపోయే ఓ సంబరం. ఆ వేడుక‌కి సినీ, రాజకీయ ప్ర‌ముఖుల‌ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించ‌డం ప‌రిపాటే. త‌మ‌త‌మ‌ ఇష్టాయిష్టాల మేర‌కు ఈ తంతును నిర్వ‌హించుకుంటారు. అయితే, రష్యా రాజధాని మాస్కోలోను ఓ జంట త‌మ అభిరుచి మేర‌కు చేసుకున్న పెళ్లి వార్త‌ల్లో నిలిచింది. ఎందుకంటే, ఈ ప్రేమ జంట వివాహ‌తంతుకి ఓ ఎలుగుబంటి పెళ్లి పెద్దయింది. కొంతకాలంగా ప్రేమలోకంలో ఎంజాయ్ చేసిన డెనిస్‌, నెల్యాలు తాజాగా పెళ్లి చేసుకున్నారు. త‌మ పెళ్లి కోసం స్టీపెన్‌ అనే ఎలుగుబంటిని తెప్పించుకుని, దాని ముందే వివాహ‌ం చేసుకున్నారు. ఆ ఎలుగుబంటికి నల్ల టై కూడా క‌ట్టి చ‌క్క‌గా త‌యారు చేశారు. వారు ఉంగరాలు మార్చుకుంటుండగా ఎలుగుబంటి ఇద్దరి చేతులు పట్టుకుని ఈ తంతును జ‌రిపించింది. అంద‌రి కంటే భిన్నంగా త‌మ పెళ్లి చేసుకోవాలనుకుని ఈ ప‌నిచేశామ‌ని, ఎలుగుబంటిని చూసి తాము ముందు భయపడినా, అది పెంపుడు జంతువులా త‌మ‌తో ప్ర‌వ‌ర్తించ‌డంతో భ‌యం పోయింద‌ని పెళ్లికొడుకు చెప్పాడు. పెళ్లి అనంత‌రం ఈ ఎలుగుబంటి కొత్త జంట‌కు బొకేలు ఇచ్చి, వారితో ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఈ ఎలుగుబంటికి మూడు నెలల వయసున్నప్పుడు వేటగాళ్లు దానిని చేజిక్కించుకున్నారు. అనంత‌రం స్వెట్లానా, యూరీ అనే దంపతులు స్టీపెన్‌ని పెంచుకొని పెద్ద‌దాన్ని చేశారు. ఇప్పుడు స్టీపెన్‌కి 23 ఏళ్లు. అది మ‌నుషుల‌తో తేలిక‌గా క‌లిసిపోతుంద‌ని స్వెట్లానా చెప్పింది.

  • Loading...

More Telugu News