: ఇది వారిద్దరికీ సంబంధించిన అంశం: కమల్, గౌతమి విడిపోవడంపై శ్రుతిహాసన్
తన తండ్రి కమలహాసన్ తో గౌతమి విడిపోవడంపై హీరోయిన్ శ్రుతిహాసన్ స్పందించింది. ఇది వారిద్దరికీ సంబంధించిన అంశమని... ఇతరుల వ్యక్తిగత జీవితం, నిర్ణయాలపై తాను మాట్లాడనని చెప్పింది. తనకు తన తల్లిదండ్రులు, చెల్లెలు అక్షర హాసన్ లే ముఖ్యమని స్పష్టం చేసింది. కమల్, తాను విడిపోతున్నామంటూ గౌతమి సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. కమల్ అంటే తనకు చాలా ఇష్టమని... ఆయన నుంచి విడిపోతుండటం తనకు చాలా బాధగానే ఉందని ఆమె తెలిపారు.