: ఆర్కేను చంపేందుకు పోలీసుల కుట్ర: వరవరరావు


మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కేను చంపేందుకు పోలీసులు కుట్ర పన్నారని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఆర్కే లక్ష్యంగానే ఏవోబీ అడవుల్లో కూంబింగ్ ను తీవ్రతరం చేశారని అన్నారు. పోలీసుల అదుపులోనే ఆర్కే ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదని చెప్పారు. బూటకపు ఎన్ కౌంటర్ లో ఆర్కేను చంపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఆర్కేను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ వరవరరావు ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News