: తెలంగాణలో పాస్ పోర్టు సేవలకు తీవ్ర అంతరాయం


తెలంగాణలో పాస్ పోస్టుల జారీ ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో, ఎక్కడకు వెళ్లి పాస్ పోర్టులు తీసుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాలో పాస్ పోర్టు సేవలకు సంబంధించిన వ్యవస్థ ఇంకా సిద్ధం కాకపోవడమే దీనికి కారణం. అయితే, మరో రెండు వారాల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెబుతున్నారు. పాస్ పోర్టు అప్లికేషన్లను పాత జిల్లాల అధికారుల వద్దకు తీసుకెళ్తే... కొత్త జిల్లా అధికారుల వద్దకు తీసుకెళ్లాలని చెబుతున్నారు. కొత్త జిల్లా అధికారుల వద్దకు వెళ్తే, ఇంకా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రాలేదని... మరికొద్ది రోజులు ఆగాలని సూచిస్తున్నారు. పాస్ పోర్టులకు సంబంధించిన నివేదికలను జిల్లా ఎస్పీలు ఆన్ లైన్ లో పంపించాల్సి ఉంటుంది. అయితే, కొత్త జిల్లాలకు ఇంకా సాఫ్ట్ వేర్ రాకపోవడంతో... వారు కూడా నివేదికలను పంపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో, విదేశాలకు వెళ్లాల్సిన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News