: ఏవోబీలో మావోయిస్టుల కోసం బలగాల వేట


ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాలు భద్రతా బలగాల బూటు చప్పుళ్లతో గజగజ వణికిపోతున్నాయి. మావోయిస్టుల కోసం ఆంధ్రా గ్రేహౌండ్స్, ఒడిశా పోలీసులు, కేంద్ర బలగాలు గాలింపు చేపట్టాయి. ఏవోబీ పరిధిలో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రతా బలగాలు కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. ఆ మార్గంలో వచ్చీపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. విశాఖ మన్యంపై హెలికాప్టర్లు సైతం చక్కర్లు కొడుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ స్థానికుల్లో నెలకొంది.

  • Loading...

More Telugu News