: అనుష్క బెస్ట్ కిస్సర్... బాయ్ ఫ్రెండ్ వెరీ లక్కీ: రణబీర్ కపూర్
వివాదాల మధ్య విడుదలైన బాలీవుడ్ సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్' బాక్సీఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో, చాలా కాలం తర్వాత యంగ్ హీరో రణబీర్ కపూర్ తన ఖాతాలో ఓ హిట్ వేసుకున్నాడు. ఈ ఆనందంలో, ప్రెస్ మీట్లలో కూడా ఫుల్ జోష్ తో చాలా కబుర్లు చెబుతున్నాడు. ఈ సందర్భంగా, ఈ సినిమాలో మీతో కలసి నటించిన ఐశ్యర్యా రాయ్, అనుష్క శర్మలలో ఎవరు బెస్ట్ కిస్సర్ అని అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ... ఐశ్వర్యకు తాను ముద్దులు పెట్టలేదని, అనుష్కకే పెట్టానని చెప్పాడు. అనుష్క నిజంగా బెస్ట్ కిస్సర్ అని, ఆమె బాయ్ ఫ్రెండ్ చాలా అదృష్టవంతుడంటూ పరోక్షంగా కోహ్లీకి కాంప్లిమెంట్ ఇచ్చాడు.