: పారాలింపిక్ విజేత దీపా మాలిక్‌కు రూ.4 కోట్ల చెక్ బహూకరించిన మోదీ


రియో పారాలింపిక్స్ విజేత దీపా మాలిక్‌కు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నాలుగు కోట్ల రూపాయల చెక్ బహూకరించారు. హరియాణాకు చెందిన మాలిక్ పారాలింపిక్స్‌లో షాట్‌పుట్ విభాగంలో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా మాలిక్ రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి ఖట్టర్, హరియాణా క్రీడాశాఖా మంత్రి అనిల్ విజ్ సమక్షంలో దీపా మాలిక్‌కు మోదీ చెక్ బహూకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ హరియాణా అమ్మాయిలు దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారని కొనియాడారు. స్త్రీపురుష నిష్పత్తి‌లో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆడ పిల్లలను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News