: తిరుత్తణి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మెడికోల దుర్మరణం


తమిళనాడులోని తిరుత్తణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెడికోలు దుర్మరణం పాలయ్యారు. ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థులు కారులో తిరుపతి నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు తిరుత్తణి వద్ద అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వైద్య విద్యార్థులు సుధీర్, శివకృష్ణ దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News