: కాపు కులాన్ని చంద్రబాబు చీలుస్తున్నారు.. దిగ్విజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. కాపు కులాన్ని చీల్చే పనిలో చంద్రబాబు బీజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. విజయవాడలోని ఓ హోటల్లో మంగళవారం నిర్వహించిన కాపు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బాబు వాడుకుని వదిలేశారని విమర్శించారు. కాపు ఓట్లతో అధికారంలో వచ్చి ఇప్పుడు వారిపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. టీడీపీలోని కాపు నేతలు ఇప్పటికైనా కళ్లు తెరిచి పార్టీ నుంచి బయటకు రావాలని సూచించారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడకు కాంగ్రెస్ అండగా ఉంటుందని దిగ్విజయ్ హామీ ఇచ్చారు.