: మహేష్ బాబు గిఫ్ట్ లతో థ్రిల్ అయిన విద్యార్థులు!


ప్రముఖ నటుడు మహేష్ బాబు ఇచ్చిన గిఫ్ట్ లను స్వీకరించిన విద్యార్థులు థ్రిల్ అయ్యారు. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ దీపావళి పండగ రోజున కూడా జరిగింది. ఈ షూటింగ్ లో మహేష్ బాబు తో కలిసి భాష్యం స్కూల్ కు చెందిన 2,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షూటింగ్ లో పాల్గొన్న విద్యార్థులందరినీ ఆశ్చర్యపరుస్తూ వారందరికి మహేశ్ గిఫ్ట్ లను అందజేశాడు. ఆ బాక్స్ పై విద్యార్థులతో కలిసి ఉన్న మహేష్ ఫొటో కూడా ఉంది. ఇక బాక్స్ లోపల, స్నిక్కర్స్ చాక్లెట్స్, పేపర్ బోట్ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి. బాక్స్ తెరవగానే విద్యార్థులు ఆశ్చర్యపోయేలా చేసే అంశం మరోటి కూడా ఉంది. ‘నా వర్క్ ప్లేస్ లో సరదాగా ఉంటూ, నవ్వులు కురిపించిన నా చిన్నారి మిత్రులందరికీ ధన్యవాదాలు!! ఆల్వేస్ కీప్ షైనింగ్.... ప్రేమతో, మహేష్ బాబు’ అంటూ మహేశ్ సంతకం చేసిన కార్డు బాక్స్ తెరవగానే కనపడుతుంది.

  • Loading...

More Telugu News