: ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్య.. ప్రాథమిక నివేదికలో వెల్లడి
ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే మెడికో సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిందని తేలింది. గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్యపై ప్రభుత్వానికి ఈమేరకు ప్రాథమిక నివేదిక అందింది. వేధింపుల కారణంగానే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుందని ఈ నివేదికలో నిర్ధారించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ లక్ష్మిని ఇప్పటికే సస్పెండ్ చేసి, ఆమెపై కేసు నమోదు చేశారని అన్నారు. ఆమెకు భవిష్యత్తులో గుంటూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చే ప్రసక్తే లేదని, ప్రస్తుతం ఆమె పరారీలో ఉందని ఈ సందర్భంగా కామినేని తెలిపారు.