: ఖమ్మం జిల్లాను డెంగీ మరణాలు వణికిస్తున్నాయి: భట్టీవిక్రమార్క


తెలంగాణ రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్ర‌బ‌లిపోతోంటే మ‌రోవైపు రాష్ట్ర స‌ర్కారు ఫాంహౌజ్‌లో నిద్ర‌పోతోంద‌ని టీపీసీసీ నేత మ‌ల్లు భ‌ట్టీవిక్ర‌మార్క విమర్శించారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని గాంధీభ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... ఖ‌మ్మం జిల్లాలోని ప‌లుప్రాంతాలను డెంగీ మ‌ర‌ణాలు వ‌ణికిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. డెంగీ వ్యాధికి చికిత్స చేయించుకోవ‌డం కోసం బాధితులు అప్పులు చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణ‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాల‌ని, డెంగీ వ్యాధితో మృతి చెందిన వారికి రూ.10 లక్షల ప‌రిహారం అందించాల‌ని అన్నారు.

  • Loading...

More Telugu News